దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండగల…
హుజూరాబాద్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటలకు ఇది చావో రేవో ..కాగా కేసీఆర్ ప్రతిష్టకు అతి పెద్ద సవాలు. ఐతే ప్రస్తుతం ఓటరు ఎటు వైపు అన్నదిఎవరికి వారు గెలుపు తమదే అన్న విశ్వాసంతో ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో ఈ నెల 30న హుజూరాబాద్ ఓటరు నిర్ణయిస్తాడు. అప్పటి వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ తప్పదు. హుజూరాబాద్ ప్రజలు పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ఇక్కడ జరుగుతున్నది…
మరోసారి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను చెప్పే అంశాలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.. కేటీఆర్తో చర్చకు తానే స్వయంగా వస్తానన్న రేవంత్… అయినా.. తమ పార్టీలో సీనియర్ల గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇక, తాము ఏదైనా అంటే కోర్టుకు పోతారని.. అయినా పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడుతాం అంటూ రేవంత్ రెడ్డి…
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్…
టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత…
వైఎస్ షర్మిల రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టబోతున్నారు. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది. ఈ యాత్రకు సంబందించిన మ్యాప్ను పార్టీ సిబ్బంది ఇప్పటికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగ…
తెలంగాణ ఇంటర్ చదివే విద్యార్థులకు అలర్ట్. ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అలా ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు. పరీక్ష ల సూపరింటెండెంట్ లు…
బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరుమాద్వి హిద్మా.. ఇప్పటికే మావోయిస్టు పార్టీలు గతంలో లాగా పట్టు బిగించలేకపోతుంది. మొన్న ఆర్కే మరణం మావోయిస్టు పార్టీని కలవరపెడితే.. తాజాగా హిద్మా ఆరోగ్యం సైతం దెబ్బతిన్నదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను తెలంగాణకు తరలించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు హిడ్మాను మోస్ట్ వాటెండ్ గా ప్రకటించి రూ.50లక్షల రివార్డును సైతం ప్రకటించారు.…
రోజు రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాల్లో బతుకు జీవుడా అంటూ జీవీతాలను గడిపే సామాన్యులు పెరిగిన ధరలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు కంపెనీల్లో మార్పుల వల్ల దేశీయచమురు కంపెనీల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.9 గా ఉండగా, డీజీల్ ధర103.18 గా…
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.ఇన్ని రోజులు ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనేవారు లేక ఇంట్లోనే ధాన్యం పేరుకుపోయిన పరిస్థితి. ఈ తరుణంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మద్దతు ధర ప్రకారమే…