కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం.. మరికొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చింది.. ఇక, తెలంగాణ ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ.. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రులు సంఘం ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది.. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని కోర్టును కోరారు పిటిషనర్.. పరీక్షలు రద్దు…
కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,69,556కి చేరింది. కరోనా నుంచి 6,61,646 మంది కోలుకోగా మొత్తం 3,942…
ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అందులో కులమే కీలకం. అభ్యర్థి ఎంపిక మొదలు గెలుపు వరకు కులందే ప్రధాన భూమిక. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది కుల రాజకీయం. కులాల మీద మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కుల రాజకీయం ఓ రేంజ్లో నడుస్తోంది. కులం ఓట్లను పక్కా చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. కులం ఓట్ల కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు.…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…
తెలంగాణలో మద్యం షాపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు.. నష్టాల్లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమేననే ప్రచారం ఉంది. మద్యం షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టినా అంతకు పదిరెట్లు లాభం వస్తుందనే నమ్మకం వ్యాపారుల్లో ఉంది. దీంతో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులంతా క్యూ కడుతుంటారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి మద్యం షాపు దక్కిందా? ఇక తమ దశ తిరిగినట్లేనని భావించే…
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని… గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని…పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం…
జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్2 పంపు హౌస్ లో భూములు కోల్పోతున్న భూ నిర్వహసితుల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొ.కోదండరాం. మనమందరం న్యాయ పరంగా మన భూముల విషయంలో పోరాడాలన్నారు కోదండరాం. భూమికి బదులు భూమి అయిన లేదా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం భయపడేది లేదని భయపడితే ఆనాడు తెలంగాణ రాకపోయేదని, స్వాతంత్రం కూడా రాకపోయేదన్నారు కోదండరాం. మీరు ధైర్యంగా…
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో ఆలయంలోని విమాన గోపురం స్వర్ణమయం కాబోతున్నది. ఈ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం,…
వైఎస్ షర్మిల ఈరోజు నుంచి ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఈ యాత్రకు ముందు వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తప్పుపట్టారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై షర్మిల విరుచుకుపడ్డారు. తాము దీక్షలు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగ భర్తీలు గుర్తుకు వస్తాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్యక్షుడిని చేసిందని,…