వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన రైతు నివేదన దీక్షకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ పోలీసులు.. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల రైతు నివేదన దీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరారు.. అయితే, మూడు రోజుల దీక్షను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు సెంట్రల్ జోన్ పోలీసులు.. కానీ, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. దానికి అనుగుణంగా వైఎస్‌ఆర్ టీపీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది… ఇందిరాపార్క్ వద్ద రేపు సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేయాలని.. ఆ తర్వాత లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు ఏర్పాట్లు చేయాల్సింది పార్టీ శ్రేణులను వైఎస్ షర్మిల ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌లో ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు అనుమతి ఇచ్చిన సెంట్రల్ జోన్ పోలీసులు.. తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు వైఎస్‌ఆర్‌టీపీ నేతలు.