తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు కొరత లేదని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్టాలకు సైతం తగినంత బొగ్గు సరాఫరా చేస్తున్నట్టు తెలిపారు. రానునున్న రోజుల్లో బొగ్గు నిల్వలను పెంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు. సింగరేణి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ డైరెక్టర్లు,11మంది ఏరియాల జనరల్…
ముఖ్యమంత్రి కేసీఆర్…ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు యాదాద్రి బయల్దేరనున్నారు. లక్ష్మినరసింహాస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిశాయ్. దీంతో నిర్మాణం, గోపురాలన్నిటినీ మరోసారి కేసీఆర్ పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ తేదీలను ప్రకటించనున్నారు.యాదాద్రి పున: ప్రారంభం తేదీ, ముహూర్తాన్ని…త్రిదండి చినజీయర్ స్వామి…ఇప్పటికే ఖరారు చేశారు. ఆలయ ప్రారంభం రోజున నిర్వహించే…మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. కేసీఆర్ పర్యటనకు…
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 208 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 201 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,69,163 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,61,294 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3940 కు చేరుకుంది..…
రేపు సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అలా ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు. పరీక్ష ల సూపరింటెండెంట్ లు హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం…
రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు…
ప్రభుత్వంని నడిపించాల్సిన సమయంలో పార్టీ మీద కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం ముందస్తు ఎన్నికలకు పోవడానికే అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు విజయ ఘర్జన సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ మీద పట్టుకోల్పోతున్నాననే భయం ఆయనలో ఉంది. బీజేపీ కూడా కేసీఆర్ కి సహకరించేందుకు హామీ ఇచ్చింది. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ వరస మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. హుజూరా బాద్ ఎన్నికల తరువాత పార్టీలో తిరుగుబాటు…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల…
మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పా.. అలాగే 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించాం అని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయి. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా…