జర్నలిస్టుల కు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇదివరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు ఎండి సజ్జనార్. తాజాగా TSRTC వెబ్సైట్లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ను తీసుకొచ్చింది ఆర్టీసీ. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సజ్జనార్. ఇక ఈ విషయంపై సూచనలు తెలిపిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్