తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్ అయ్యాయి.. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…
తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆయన తిరుగులేని విజయాన్ని సాధించారు.. మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. 20 రౌండ్లోనే ఈటల రాజేందర్ విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే.. అప్పటికే ఈటల రాజేందర్ 21 వేలకు పైగా ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ఈటలకు లభించిన ఆధిక్యమే అధికంగా…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరప్రదమైన ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన ఓట్లు రాబట్టలేకపోయింది.. అయితే, ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది.. ఉప ఎన్నికల ఫలితాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్నే రేపుతున్నాయి.. ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
కవులు, కళాకారులు కన్న తెలంగాణ రాలేదని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. మంగళవారం ఆయన భువనగిరి మండలం హనుమపురం కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంగు ప్రహ్లాద్‌కు మనం ఘనంగా నివాళులర్పిం చాలన్నారు. మా భూములు, మా నీళ్లు, మా వనరులు,మా పాలన ఇంకా మాకు రాలేదన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాణం ఈ భూమిలోనే ఉందని తెలంగాణ సమస్య అంటే…
ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. రౌండ్ రౌండ్‌కి ఆయనకు లీడ్ పెరిగిపోతూనే ఉంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా వెనుకబడిపోగా.. ఓ దశలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది.. కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేదర్ ఆధిక్యాన్ని కనబరిస్తే.. మరికొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆధిక్యంలోకి వచ్చారు.. కానీ, ఓవర్ ఆల్గా మాత్రం.. ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతూనే వచ్చారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాయి.. మొదటి నుంచి తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంపై నమ్మకంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు.. అంతకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక, రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ లీడ్ పెరిగిపోతూనే ఉంది.. 15 రౌండ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యం 11 వేలను క్రాస్ చేసింది.. ఇక, ఈటల రాజేందర్‌కు పట్టున్న ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉండడంతో.. బీజేపీ విజయం…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలువడలేదు.. కానీ, ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయిన కాంగ్రెస్‌లో మాత్రం అప్పుడే రచ్చ మొదలైంది.. అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసే ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్లు చేశారు.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎన్నికల నోటిఫికేషన్…
యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..?…