వ్యాక్సినేషన్‌పై హరీష్‌రావు డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్ స్థాయి, పీహెచ్‌సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ఆదేశించారు.. ఇదే సమయంలో ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్‌లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించాలని.. అక్కడే వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read Also: టీఆర్ఎస్‌కు మరో షాక్..! పార్టీకి మాజీ మేయర్ గుడ్‌బై..
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
ఇంటింటి సర్వే నిర్వహించి వందకు వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు.. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్న ఆయన.. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచండి.. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేపట్టాలి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5.55కోట్ల డోసులు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.60కోట్ల డోసులు వేశామని.. మరో 1.90కోట్లు వేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, సిద్దిపేట నుండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్‌రావు.. ఆశాలతో, ఏఎన్ఎంలతో, డీఎం అండ్ హెచ్‌వోలతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!