తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
Read Also: మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై
రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు… మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.దామోదర్‌రెడ్డి… నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 12 స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. కరీంనగర్‌లో 2, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాలలో ఒక్కో స్థానానికి డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14న ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తారు.