సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో ఎస్సై షఫీని, తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మహిళ భర్త ప్లాన్‌కు అతడి స్నేహితులు కూడా సహకరించారు.
Read Also: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం : జగన్
దీంతో ఎస్సై తన భార్యతో రాసలీలలు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మహిళ భర్త తన స్నేహితులతో కలిసి వారిద్దరిని చితకబాదాడు. ఎస్సై ఎంత వేడుకున్నా వినలేదు. ఎస్సైను ఏమీ అనొద్దని తన భార్య వకాల్తా పుచ్చుకున్నా వినిపించుకోకుండా బడితపూజ చేశాడు. తన భార్యపై కూడా చేయి చేసుకున్నాడు. చివరకు ఎస్సై రాసలీలల వ్యవహారం గురించి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఉన్నతాధికారులు ఎస్సైను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తీవ్ర గాయాల పాలైన షఫీని ఆస్పత్రికి తరలించారు.
Wanaparthy Rural SI Shafi Suspended against Illegal Extra Marital Affair Allegations#Wanaparthy #SIshafi #NTVNews #NTVTelugu pic.twitter.com/bwckmUHZqx
— NTV Telugu (@NtvTeluguLive) November 26, 2021