వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.. అధికార టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్నారు.. అయితే, బీజేపీకి అంత సీనేలేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఆరిపోయే దీపం..!
బీజేపీకి 80 సీట్లు కాదు కదా 8 సీట్లు వస్తే గొప్ప అని తేల్చారు వీహెచ్. ఇక, వ్యవసాయ చట్టాల విషయంలో కూడా బీజేపీ మూర్ఖంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్టుకోలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. తాత్కాలికంగా నష్టపోయినా భవిష్యత్తు కాంగ్రెస్ దే అన్నారు.. దబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు కాదు.. అది రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌ల గెలుపు మాత్రమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. ఏడేళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నాంటాయని మండిపడ్డ వీహెచ్.. కాంగ్రెస్ పార్టిని విమర్శించే స్థాయి బీజేపీ నేతలకు లేదని కౌంటర్ ఇచ్చారు.