వరసగా ఏసీబీ దాడులు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా విమర్శలు. వీటికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఏకంగా సబ్ రిజిస్ట్రార్లకే కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిఘా పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందుకే నీడ కనిపించినా ఉలిక్కి పడుతున్నారట అధికారులు, సిబ్బంది. నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు..! మామూళ్లు ఇస్తే కానీ.. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనులు జరగవనే…
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి? తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్ఎస్కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు……
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం.. వ్యాక్సినేషన్ కాబట్టి… అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విజయ వంతంగా అమలు చేస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ.. కరోనా వ్యాక్సినేషన్ విజయం వంతంగా ముందుకు సాగుతోంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి…
తెలంగాణలో ఒక్క అక్టోబర్ నెలలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. 2020 అక్టోబర్ నెలతో పోలిస్తే సుమారు రూ.30 కోట్లు అధికంగా మద్యం అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్ తో పోలిస్తే ఏకంగా వెయ్యికోట్లు అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా పండుగలు, సెలవులు అధికంగా ఉన్న సమయాల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. Read: దీపావళి ని మన దేశంలో…
దీపావళి పండుగ నేపథ్యంలో దేశ ప్రజల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఇచ్చారు. ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుందని… మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటామని తెలిపారు. భారతీయ సంస్కృతిలోని…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ గెలుపు.. ప్రజల గెలుపు అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా… చివరికి తామే గెలిచామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ పేరుతో తప్పించుకున్నారని… దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు. దళిత బంధు…
జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం)…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.. ఇక, తెలంగాణలో మొదటల్లో వ్యాక్సిన్ లేక కొన్ని రోజులు వ్యాక్సిన్కు హాలిడేస్ ప్రకటించినా.. ఆ తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్లో వేగం పుంజుకుంది.. ఫస్ట్ డోస్ కొనసాగిస్తూనే.. ఫస్ట్ డోస్ తీసుకుని.. సెకండ్ డోస్ వేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నవారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అయితే, పండుగ సమయంలోనూ వ్యాక్సిన్కు హాలిడే ఇస్తూ వస్తున్నారు.. రేపు దీపావళి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో చెప్పుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు, సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ ప్రజల్లో చరిష్మా ఉన్న నేత లేరనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా…