గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్ నెలకొందా? రోజులు గడుస్తున్నా ఈ అంశంపై ఉలుకు లేదు.. పలుకు లేదు. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించడంతో.. ఇప్పుడేం జరుగుతుందా అని టీఆర్‌ఎస్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఫైల్‌పై కబురు లేదా?
Also Read
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకం తెలంగాణలో మళ్లీ చర్చగా మారుతోందా? గతంలో కేబినెట్ ఆమోదించి పంపిన కౌశిక్‌రెడ్డి ఫైల్‌ను అనుమానాల నివృత్తికోసం గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. సోషల్ సర్వీస్ కింద కౌశిక్‌రెడ్డి పేరును నాడు నామినేట్ చేసింది ప్రభుత్వం. అయితే మరికొంత స్టడీ చేయాల్సి ఉందని చెబుతూ ఆ ఫైల్‌ను పక్కన పెట్టారు గవర్నర్. ఇంతలో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో పాత ప్రతిపాదనను విత్‌డ్రా చేసుకున్న సర్కార్.. గవర్నర్ కోటాలో కొత్తగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును కేబినెట్‌లో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించింది. ఆ ఫైల్ వెళ్లింది కానీ.. అక్కడిని కబురు లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.
గవర్నర్ దగ్గరే ఫైల్ పెండింగ్?
మధుసూదనాచారి పేరును నామినేట్ చేసి వారం అవుతున్నా ఇంకా అధికారికంగా గెజిట్ విడుదల కాలేదు. దాంతో మళ్లీ ఏమైంది అనే చర్చ జరుగుతోంది. కౌశిక్‌రెడ్డి ఫైల్ తరహాలోనే మాజీ స్పీకర్ ఫైల్‌పైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే పెండింగ్‌లో ఉందా? ఎక్కడ ఆగిపోయింది? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.
ఎన్నికల కోడ్ కారణంగా గెజిట్ విడుదల కాలేదా?
కోడ్ ముగిశాక గెజిట్ విడుదలవుతుందా?
రాజ్‌భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. మధుసూదనాచారి ఫైల్‌ను గవర్నర్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారని టాక్. అయితే గెజిట్ విడుదల కాకపోవడంతో ప్రశ్నలు.. అనుమానాలు తెరపైకి వస్తున్నాయట. గెజిట్ విడుదల కాకపోవడానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడే కారణమన్నది రాజ్‌భవన్ వర్గాల వాదన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలులో ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ వివరణ కోసం ఫైల్‌ను పంపించారని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గెజిట్ విడుదలవుతుందని టాక్. ఒకవేళ ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఎన్నికల కోడ్ ముగిశాక గెజిట్ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ విషయం తెలియక.. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ను తలచుకుని కలవర పడుతున్నాయి పార్టీ వర్గాలు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!