ఈటల రాజేందర్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.. దీంతో.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు అయ్యింది.. అయితే, ఈ ఎన్నికల్లో విజయం క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌దే అనే చర్చ సాగుతోంది.. ఈటల లేకుండా హుజురాబాద్‌లో బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయని అని గణాంకాలు వేసేవారు కూడాలేకపోలేదు. అయితే, ఇవాళ ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఈటల రాజేందర్ గెలుపు బీజేపీ గెలుపు…
తాజాగా వెలువడిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి.. ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీని టార్గెట్ చేస్తూ సీనియర్లు విమర్శలు చేయడంతో.. ఇవాళ గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది.. అయితే, ఈ సమావేశానికి పార్టీపై విమర్శలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టగా.. పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం కొనసాగుతుండగానే.. మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతి సారి సమావేశానికి రాను.. నా…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే.. టీఆర్ఎస్ పోరాడా ఓడింది.. కానీ, కాంగ్రెస్ మాత్రం ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. దీంతో.. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తుంది అధికార పక్షం.. దానికి తోడు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం రచ్చగా మారింది. అయితే, హుజురాబాద్‌లో పార్టీ ఘోర పరాజయంతో పాటు.. పీసీసీని టార్గెట్ చేస్తూ.. నేతలను చేసిన…
హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సెగ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తాకింది.. దానికి ప్రధాన కారణం.. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్లో ఆయన సవాల్ చేయడమే.. అయితే, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు రావాలి.. ఈటల గెలవాలి.. అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు గువ్వల.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడం.. ఈటల…
నిర్మల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే…
తెలంగాణలోని పలు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. Read Also: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసిందెవరు? మరోవైపు…
తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో వేములవాడ ఉపఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే తమతో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు. Read Also: కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు: షర్మిల కాగా…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు చెంపచెల్లుమనేలా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని.. ఉద్యమకారులని ఈ ఎన్నిక ద్వారా నిరూపించారని షర్మిల కొనియాడారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్టకథలు జనం నమ్మరని… ఇకనైనా…
తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 167 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 207 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,790 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,959కు పెరిగింది.. ఇక,…