టీ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి?
జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..!
Also Read
తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర కార్యవర్గంపై చర్చ పక్కకు పోయింది. ఇప్పుడు జనవరి నుంచి పార్టీ కార్యక్రమాలు.. కొత్త కమిటీలు.. డీసీసీ అధ్యక్ష నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే… డీసీసీ అధ్యక్షుల నియామకంలో భారీగా ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయట. దీనిపై జరుగుతున్న చర్చే ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్.
పనిచేసే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు..!
కాంగ్రెస్ సభ్యత్వం నమోదు మీద ఫోకస్ పెట్టింది. డిజిటల్ మెంబర్‌షిప్‌పై నేతలకు.. కేడర్‌కు అవగాహన కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో వీటిని ఎవరెలా నిర్వహిస్తారన్నది టాస్క్. అందుకే జనవరిలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలు పెట్టే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం. పనిచేసే వారికి ప్రాధాన్యం ఇచ్చేలా నేతలను ఎంపిక చేస్తారట. సభ్యత్వం నమోదు ఆధారంగానే డీసీసీ అధ్యక్షుల నియామకం ఉండొచ్చని సమాచారం. నియోజకవర్గ బాధ్యతలు కోరుకునే వారికి కూడా అదే ప్రామాణికమట.
సభ్యత్వ నమోదే పార్టీ పదవులకు గీటురాయి..!
నియోజకవర్గ ఓటర్లలో 10 శాతం సభ్యత్వం నమోదు చేస్తేనే పార్టీ పదవులకు పరిగణనలోకి తీసుకునే ఆలోచనలో ఉందట పీసీసీ. పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ఎవరైతే అమలు చేస్తారో.. జిల్లాపై ప్రభావం చూపించే బలమైన నాయకులతో జాబితా సిద్ధం చేసి.. వారిలో ఒకరిని జిల్లా కాంగ్రెస్ సారథులను చేస్తారట. పనిచేస్తే పదవి.. లేదంటే పక్కన పెట్టడమే అని గాంధీభవన్ వర్గాల టాక్. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులలో చాలా మందిని మార్చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిషన్ 2023 దిశగా ఎవరైతే చురుకుగా కదులుతారో వారికి పట్టం కడతారని మరికొందరు చెబుతున్నారు. పీసీసీ సారథి కూడా ఇదే లక్ష్యంతో జనవరి నుంచి కార్యాచరణ రూపొందించుకుంటారని సమాచారం.
నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు ప్రోగ్రస్ రిపోర్ట్..!
కేవలం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులనే కాకుండా.. ప్రస్తుతం నియోజకవర్గాల ఇంచార్జ్ అనుకునే వారికి కూడా ప్రోగ్రస్ రిపోర్ట్ చూశాకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట. మొత్తానికి పదవుల పంపకమైనా.. నేతల ఎంపికైనా జనవరి నుంచి భారీ ప్రక్షాళన తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. మరి.. ఇప్పుడున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో ఎంతమందికి మళ్లీ పదవీయోగం ఉంటుందో.. కొత్త వాళ్లకు ఎంత మంది తెరపైకి వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!