తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి వెబ్సైట్ లో భారీ మార్పులకు సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్ తో సమస్యల పరిష్కారం చూపించనుంది. వ్యవసాయ భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే రైతుబందు అమలు నిలిపివేయనున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణిలో సమస్యల పై కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వేలాది మంది రైతులు. ఆ రైతుల విన్నపాలు సుమోటోగా తీసుకుని పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు.. వారం రోజుల్లో ధరణి నిషేధిత జాబితా నుంచి భూముల తొలగించాలని పేర్కొన్నారు.