దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్…
KTR: వరంగల్‌లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం…
Bandi Sanjay : తెలంగాణలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వమే విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు…
CM Revanth Reddy : తెలంగాణ సాధనకు ప్రాణంగా నిలిచిన నీళ్ల అవసరమే ఇప్పుడు ప్రజలకు నష్టంగా మారిందని, భావోద్వేగాన్ని రాజకీయంగా వాడుకున్న వారి తప్పిదాలే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ వ్యవధిలోనే విఫలమై, కుప్పకూలిన ఘటన భూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నీటి కోసం మొదలై రాష్ట్రాన్ని సాధించిన ఆవేదనపై ఆయన…
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో ముఖ్యమైన ఇంజనీరింగ్ వారసత్వం, జలసౌధ, ప్రభుత్వ ఉద్యోగాలు, మరియు ప్రాజెక్టుల స్థితి గురించి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగుల బలోపేతం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతనంగా ఉద్యోగాలు పొందుతున్న వారికి అభినందనలు. మీరు గొప్ప ఇంజనీర్ల వారసత్వం పొందుతున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత రత్న…
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…