మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న…
బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే…
Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్,…
KTR : తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన…
Bandi Sanjay Kumar: గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు…
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
Damodara Raja Narasimha : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం…
Raja Singh : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ నేత రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని కీలకంగా కోరారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని స్పష్టంగా తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కేవలం టైమ్ పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మరోసారి అలాంటి సమావేశమే జరుగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ…
Minister Seethakka : తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం…