Telangana Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ ముదిరాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన నేతలు, వారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నట్టరాజన్‌కు ఫిర్యాదు చేయాలని జిల్లాలో పలువురు నేతలు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కొండా మురళి కాంగ్రెస్‌లోకి వచ్చి పదవులు వహించడాన్ని సవాల్‌గా తీసుకున్న నేతలు, ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి వచ్చారన్న కారణంతో పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేస్తున్నారు.
Devineni Avinash: నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు!
“ఎన్నికల ముందు పెద్దమనుషుల కాళ్లు పట్టుకున్న నాయకు డు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు” అంటూ కొందరు నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతులు గతంలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా వర్గీయ రాజకీయాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొండా సురేఖ చేసిన “మరో రోజు కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి” అనే వ్యాఖ్యలతో పార్టీకి తలెత్తిన వివాదం మరింత ముదిరింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఒక్కటై కొండా దంపతులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి తీరుపై అధిష్టానం స్పందించాలని, పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.