హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు.
READ MORE: Brahmanandam: కన్నప్ప సినిమాని ఆదరించండి…అల్లరి చేయకండి !
మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున బెయిల్ మంజూరు చేయాలని లీగల్ టీం వాధించింది. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
READ MORE: Kadapa: కడప కార్పొరేషన్‌లో కోల్డ్ వార్.. కమిషనర్ సహా 8 మందికి మేయర్ షోకాజ్ నోటీసులు..