Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్…
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్,…
Mahesh Goud: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం మియాపూర్‌లోని సహాయా ఓల్డ్ ఏజ్ హోమ్ లో హృదయపూర్వకంగా నిర్వహించబడ్డాయి. వృద్ధుల మధ్య ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాజు, ఆయన స్నేహితుల బృందం సంయుక్తంగా నిర్వహించారు. మానవత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో సహాయా ఫౌండేషన్‌కు చెందిన లయన్ డాక్టర్ రఘు, లయన్ డాక్టర్ నీలూ ముఖ్య అతిథులుగా హాజరై, మహేశ్…
TPCC Mahesh Goud : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత…
బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు.…
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు.
"లెటర్ టూ డాడి" అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను…
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…
KTR : తెలంగాణా రాష్ట్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం స్థితిలోకి మారిపోయిందని, ఇది ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఒప్పుకుంటున్న విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారింది. ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడి తన చార్జ్ షీట్ లో…