Padi Kaushik Reddy : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో, సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదులో, రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు.
CM Chandrababu : సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం.. గిరిజన విద్యార్థులు రికార్డ్ సృష్టించారు
అరెస్టు అనంతరం కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై IPC సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఆయనను ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే ప్రక్రియ చేపట్టిన పోలీసులు, తరువాత జైలుకు తరలించనున్నారు. అయితే, వైద్య పరీక్షలకు ముందుగా BRS లీగల్ టీమ్ రాక కోసం వేచి చూడాలని, తమ అభ్యర్థనను పోలీసులకు తెలిపారు కౌశిక్ రెడ్డి.
Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం