ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా…
శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. సోమవారం రాత్రి 9:58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో నేడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య…
TG Assembly Sessions: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడవ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేశారు. Kandula Durgesh: కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం..…
Robbery : హనుమకొండ నగరం పెద్దమ్మ గడ్డ సమీపంలోని కేసర్ గార్డెన్ రోడ్ నెంబర్ 5 లో ఘరానా దొంగలు కొత్తగా నిర్మాణంలో ఉన్న గృహాలను టార్గెట్ చేస్తూ ఇంటి యజమాని లేని సమయంలో వచ్చి ఎలక్ట్రిషన్, ప్లంబర్ వర్కర్లమని చెప్పి నూతన ఇంటిలో పని చేస్తున్న బిహారి వాళ్ళని నమ్మించి విలువైన సామాగ్రిని పట్టపగలే చోరీ చేశారు. సుమారు రూ. 30 నుండి నలభై వేల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కు సంబంధించిన…
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు.
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.
జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే…
సామాన్యులకు అధిక ప్రాధాన్యం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను…
ఈరోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ కూతురి వివాహానికి హాజరుకానున్నారు. నేడు పులివెందులలోని వైసీపీ క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రేపు బెంగళూరులో ఓ వివాహానికి హాజరుకానున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏపీ విపత్తుల శాఖ పర్యటించనుంది. ముండ్లమూరు, తాళ్లూరు మండళ్లాల్లో వరుస భూప్రకంపనలపై అధ్యయనం చేయనున్నారు. నేడు వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో వంగవీటి రాధాకృష్ణ…