Maoist Arrest : తెలంగాణలోని బీర్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, ప్రభాకర్‌గా ప్రసిద్ధి చెందిన బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణరావు నాలుగు దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా ఉన్నారు , సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో అగ్ర నక్సల్ నాయకుడు ముప్పాల లక్ష్మణరావుకు దగ్గరి బంధువు. లక్ష్మణరావు కూడా బీర్పూర్ గ్రామానికి చెందినవాడు. అరెస్టయిన మావోయిస్టు నాయకుడు మావోయిస్టు పార్టీకి చెందిన మొబైల్ పొలిటికల్ స్కూల్ (మోపోస్) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు,…
DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి…
ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు: ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం…
నేడు కడపకు వైఎస్ జగన్: నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. విద్యార్థులకు గుడ్…
నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. నేడు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఎంపీ కేశినేని చిన్ని తుమ్మలపల్లి కలా క్షేత్రంలో విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. విజయవాడ దుర్గమ్మ భవానీ దీక్షల విరమణ నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. రేపటితో భవానీ దీక్షలు ముగియనున్నాయి. నేడు మాజీ మంత్రి పేర్ని…
FIR On KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయంలో తెలంగాణలోని ఏసీబీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) లేఖ రాసింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ ఖాతాల నుంచి నగదు బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు దాన కిషోర్ కేసు వివరాలను కూడా పంపాలని కోరింది. ఎంత మొత్తం…
బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే.. నిందితులు తమ వాహనాల్లో…
పెనమలూరులో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు: ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి…
నేడు విజయ డైరీ పాలకవర్గ సమావేశం నంద్యాలలో జరగనుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పోలీస్ భద్రత కల్పించాలని చైర్మన్ ఎస్వీ జగన్, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిలు గురువారం నంద్యాల ఎస్పీని కోరారు. శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.…
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.