Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్‌లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి…
21 నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది…
Secretariat Employees Association Elections: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన వంటి వివరణలను అధికారులు వెల్లడించారు. తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. Also Read: Oscar 2025 : ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న’సంతోష్’ * నామినేషన్ల దాఖలు: 18.12.2024 నుండి 19.12.2024 వరకు…
ఏపీలో ‘డైకిన్’ పెట్టుబడులు: జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది. నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్: మాజీ సీఎం వైఎస్…
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల…
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. కర్నూలులో వైసీపీ నేత తెరనేకల్ సురేంద్ర కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని నేడు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నేడు మంత్రి నారాయణ కాకినాడలో పర్యటించనున్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈరోజు విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ పర్యటించనున్నారు.…
బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే దాడులు: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని…
శ్రీవారి భక్తుల అలర్ట్: శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో…
నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని గుట్టపల్లి, సోమవరం, శెట్టిపల్లి గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎస్సీ ఉపకులాల…