TG Cabinet Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు ఖరారు చేయడం ఈ భేటీకి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రైతు భరోసాపై కొన్ని సిఫార్సులు రూపొందించింది. వీటిలో పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడం, అలాగే రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు
ఇది మాత్రమే కాకుండా, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీలు వంటి నిత్యవసరాల సరఫరా చేసే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.
అదనంగా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్కు అవసరమైన సర్వే గణాంకాలను అందించే అంశంపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నారు. సుమారు 20 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుందని విశ్వసనీయ సమాచారం.
ఈ కీలక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, లబ్ధిదారులు, , పౌరులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు