Duddilla Sridhar Babu : ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్నిమాపక శాఖలో డ్రైవర్ అపరేటర్‌లకు మొట్టమొదటి బ్యాచ్‌కు నేడు పాసింగ్ అవుట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విపత్తు స్పందన , అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు మీ ట్రైనింగ్ ఎలా ఉందో వివరించారని, డ్రైవర్ ఆపరేటర్ల అందరి పైన గురుతుర బాధ్యత ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. విపత్తు ఎక్కడ జరిగిన మేమున్నామన్నా ధైర్యం కల్పించేలా ఉండాలని, ఫిబ్రవరిలో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను సీఎం రేవంత్ ప్రారంభించారన్నారు. నియమాకాలకు సంబంధించి ఓ పరిష్కాయం చూపించి న్యాయ పరంగా ఉన్న చిక్కులను తొలగిస్తూ ఉద్యోగ నియమకాలను చేస్తుంది ప్రజా ప్రభుత్వమని, మొత్తం 878 మందికి ప్రజా ప్రభుత్వంలో ఎస్‌డీఆర్ఎఫ్ లో నియామకాలు చేయడం గర్వంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చారని, వరంగల్, ఖమ్మంలో వరదల సమయంలో ముందుండి నిలబడి భరోసా ఇచ్చిన ఫైర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి శ్రీధర్‌బాబు. ఈ రోజు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి , చదివించి నేడు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా వారి ఆనందభాష్పాలు మీకందరికి స్పూర్తిధాయకంగా నిలవాలని, ఉద్యోగ ధర్మంలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు రాష్ర్టానికి, డిపార్ట్మెంట్ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత డ్రైవర్ అపరేటర్ లకు మొట్టమొదటి బ్యాచ్ ఇది అని, నిజాం బ్యాచ్ నుండి అగ్నిమాపక దళం ఉందన్నారు. డ్రైవర్ ఆపరేటర్ల జాబు చాలా కీలకమైనదని, ఫైర్ కాల్ వచ్చిన తర్వాత వన్ మినిట్ లో వెహికల్ బయలుదేరాల్సి ఉంటుందన్నారు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మొదటి నిమిషంలోనే వెహికల్ బయలుదేరే విధంగా రెడీగా ఉంచాలని, 790 ఫైర్ కాల్స్ ని అటెండ్ అయ్యామన్నారు నాగిరెడ్డి. 1765 మందిని సేవ్ చేసామని, ఇందులో 400 మందికి పైగా ప్రమాదాల్లో కాపాడగా, మిగతా వాళ్ళను విపత్తు దాంట్లో కాపడగలిగామన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్లో 454 లకు ఫైర్ వేహికిల్స్ ఉన్నాయని, గత కొన్నేళ్ళుగా ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్ల రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఆర్టీసీ నుండి కొంత మందిని తీసుకొని వినియోగించామని ఆయన తెలిపారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు 26 మంది, ఫైర్ మెన్లు సుమారు 600 మందికి పైగా కూడా ట్రైనింగ్ పూర్తి చేసి విధి నిర్వహణలో చేరారని, ఏడాది ఫైర్ డిపార్ట్మెంట్లో 800 మందికి పైగా సిబ్బంది రిక్రూట్ అయ్యారన్నారు. ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు ఎల్లప్పుడూ ఫైర్ డిపార్ట్మెంట్ ముందుంటుందన్నారు డీజీ నాగిరెడ్డి.
IND vs AUS: భారత బౌలర్ల దాటికి కంగారులు విలవిల.. స్వల్ప ఆధిక్యంలో భారత్