రెండు లక్షల మందితో ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను నేడు మంత్రి నారా లోకేష్ సమీక్షించనున్నారు. మోడీ రోడ్ షోను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం తోట కళ్యాణ మండపంలో నేడు శ్రీ రంగనాథ కోదాడ దేవి కళ్యాణం జరగనుంది.
నేడు హోంమంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై పరిశీలన చేయనున్నారు.
నేటితో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. ముగింపు వేడులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నాయి.
ఉదయం 9.30 గంటలకు జ్యోతిబాపూలే ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం జరుగనుంది. సివిల్స్కు ప్రిపేరవుతున్న పేద కుటుంబీకులకు సింగరేణి సంస్థ అధ్వర్యంలో రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జరుగనుంది.
నేడు మాదాపూర్‌లో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్దం చేసింది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనంను హైడ్రా కూల్చివేయనుంది.
నేడు చిక్కడపల్లి పీఎస్‌కు హీరో అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో పోలీసు విచారణకు బన్నీ హాజరుకానున్నారు. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని అల్లు అర్జున్‌కు కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది.