DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే అవసరం రేవంత్ రెడ్డికి లేదా అంటూ ప్రశ్నించారు.
Also Read: Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
జైపాల్ రెడ్డి పేరు ప్రాజెక్ట్‌కు పెట్టడం రేవంత్ రెడ్డి బంధు ప్రేమకు నిదర్శనమని డీకే అరుణ ఆరోపించారు. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? జూరాల ప్రాజెక్టుకు శాంక్షన్ చేయించింది సమరసింహ రెడ్డి అని, భీమా ప్రాజెక్ట్ కోసం మా నాన్న పోరాడారని ఆమె మాట్లాడారు. కావాలంటే మెట్రో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టండి. కానీ, ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు తగదని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.
అలాగే డీకే అరుణ రైతు సంక్షేమంపై కూడా ప్రభుత్వం చర్యలను విమర్శించారు. రైతు భరోసా కింద 15 వేలు ఇవ్వాల్సిందేనని, బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి ఎన్నికల ముందు తెలియదా? గెలవడం కోసం అబద్ధాలు చెప్పావా? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
Also Read: CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
తాను బీజేపీ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాకుండా, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం అని ఆవిడ అన్నారు. అలాగే ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న సీఎం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి గుర్తు చేశారు.