HYDRA : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టి 5 అంతస్తుల భవనం నేల మట్టం చేసింది. అయితే దీనిపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీ సర్వే నంబరు 11/5 లో ప్లాట్ నంబరు 5/13 పేరిట 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేసింది హైడ్రా.. ఈ కూల్చివేతలో స్థానిక పోలీసులతో పాటు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని ముందుగానే పరిశీలించించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..
100 అడుగుల విస్తీర్ణంలో ముందు ఉన్న రహదారికి ఆనుకుని ఎలాంటి సెట్ బ్యాక్‌లు వదలకుండా.. తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా చేపట్టిన భవన నిర్మాణం చేపట్టారు. సెల్లార్‌లోనే కిచెన్ ఉండేలా నిర్మించినట్టు గుర్తించారు హైడ్రా అధికారులు.. ఈ అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టు గత సంవత్సరం ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు జీహెచ్ ఎంసీ జారీ చేసింది.. అలాగే 26.2.24న స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది… హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నంబరు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించడమే కాకుండా కూల్చివేతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని 19.4.24 తేదీన ఆదేశించింది.. హైకోర్టు ఆర్డర్ ను ఆధారంగా తీసుకుని 13.06.2024 తర్వాత కొంత భాగాన్ని కూల్చివేసింది..
ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారంటూ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు స్థానిక అధికారులు.. కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీసుతో పాటు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని తీవ్రంగా పరిగణించారు హైడ్రా కమిషనర్.. అక్కడికక్కడే కూల్చివేతలకు సంబంధించి జీహెచ్ ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు 14.2.24న ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు హైడ్రా కమిషనర్.. అన్నీ పరిశీలించి కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించడంతో కూల్చివేతలు చేపట్టారు అధికారులు..
అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టడాలు అక్రమమేనన్న హైడ్రా కమిషనర్.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన కట్టడాలను హైడ్రా మొదటగా కూల్చివేత ప్రారంభించనుందని తెలిపారు. ఆదివారం కూల్చేసిన భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా నివేదిక తయారు చేస్తోంది.. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల్లో అనేక హాస్టళ్లు నిర్మాణంలో ఉన్నాయి.. వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఈ అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారు.. ఆయా భవనాలకు ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేవు అనేది స్పష్టం.. అక్రమ నిర్మాణాలతో మురుగు నీటి వ్యవస్థ కూడా బాగా దెబ్బతింది.. దీంతో ఆ పరిసరాలు మురుగు మయంగా మారి రహదారుల్లో మురుగు నీరు పారుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది మౌలిక సదుపాయాలపై (డ్రెయినేజ్ పైపులపై) అధిక భారం వల్ల జరుగుతోంది. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు GHMC కమిషనర్ తో సమీక్ష నిర్వహించి సమన్వయంతో చర్యలు తీసుకుంటాం’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..