సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తప్పుపట్టారు. సోషల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సామజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అనవానించడం సబబు కాదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే…
బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్సీ కవిత రేపటి నుంచి దీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కవిత దీక్షకు సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9…
Kaleshwaram Commission : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు. ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ…
TPCC Mahes Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా తెలిపారు. “మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను ప్రారంభించాం. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న వాస్తవాలను నేరుగా తెలుసుకోవడానికి,…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్రల షెడ్యూల్ ప్రకారం, జూలై 31న పరిగి పట్టణంలో సాయంత్రం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర అనంతరం పరిగి లో రాత్రి బస చేయనున్నారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానం…
తెలంగాణ కాంగ్రెస్ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలోళ్ళని ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు…. తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్ పార్టీలో కామన్. కానీ… ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా లేదంటే పార్టీ డీఎన్ఏలోనే…
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
కేబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్లో ఉన్న ఆ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అధిష్టానం మీద అలిగారా? అందుకే… ప్రభుత్వం తనకిచ్చిన కారు, గన్మెన్ని తిప్పి పంపేశారా? దాని వెనక చాలా పెద్ద స్కెచ్చే ఉందా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటి ఆయన స్కెచ్? వనపర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సౌమ్యుడని పేరున్న ఈ నేత… కాంగ్రెస్ సహజశైలికి కాస్త భిన్నంగా ఉంటారని, అంత తొందరగా అసంతృప్తిని…
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్…