TPCC Mahes Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా తెలిపారు.
“మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను ప్రారంభించాం. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న వాస్తవాలను నేరుగా తెలుసుకోవడానికి, వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఇదొక సాధనంలా వుంది,” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
IND vs ENG: పెవిలియన్కు వరుస పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. భారత్ 224 ఆలౌట్!
గాంధీ యాత్రల నుండి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వరకు పాదయాత్రలు దేశ ప్రజలను చైతన్యపరిచిన ఉదాహరణలుగా నిలిచాయని గౌడ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలు కూడా ప్రజల్లో కొత్త ఆశలు నింపాయన్నారు. అదే దారిలో టీపీసీసీ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
ఈ యాత్రలో ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తదుపరి పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పులతో తాము అధికారం చేపట్టామని, అయినప్పటికీ ప్రతి నెలా 6 వేల కోట్ల అప్పు చెల్లిస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గౌడ్ వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిబంధనపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రజల ఆకాంక్షలకే స్పందనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం,” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
CM Chandrababu: తోక తిప్పితే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..