కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లేదా..? ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..? పక్క పార్టీ హడావుడి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్‌గా వుందా? ఊరంతా ఒకదారి లో ఉంటే.. వీళ్ళంతా ఏదో దారిలో ఉన్నట్టు కనిపిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు క్లారిటీ రావడం లేదా? ప్రత్యర్ధి తన ఘనతగా గగ్గోలు పెట్టీ చెబుతుంటే… అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంకా ఏం చేయాలి అనే స్పష్టత ఉన్నట్టు లేదు. GST.. పై బీజేపీ ప్రజల మీద భారం…
అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు తాను వివరించానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్…
మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్‌ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసి బదనాం చేస్తోందని ఆరోపించారు.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని లేదా కొత్త పార్టీ పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు.
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, అలాగే మైనారిటీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహ ఘోష్ కమిషన్ నివేదికను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానిపై అమలు చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ… తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయిపోయారా? అందుకే ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేస్తున్నారా? అదిగో, ఇదిగో అనుడే తప్ప పదవుల భర్తీ ఎన్నడు? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేసిన కీలక నాయకులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్‌లు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించింది పార్టీ నాయకత్వం. అందులో…