TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన చైర్మన్ పదవులు, బోర్డు పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.…
TPCC Mahesh Goud : బీజేపీ చేపట్టిన మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విషయమై మాట్లాడే అర్హత బీజేపీకి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల మెప్పు పొందిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. Hindu Rate Of Growth:…
ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఎన్నికల సమయంలో మాత్రం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత అంటూ.. చాంతాడంత లిస్ట్ ఇచ్చారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టీపీసీసీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సందేశం పంపిస్తూ పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వైఖరి పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. “గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ” అని అన్నారు.. నేషనల్…
TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన…
Off The Record: ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీభవన్‌లో. స్థానిక నాయకులతో సంబంధం…
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది…
TPCC Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు.…
TPCC Chief Mahesh Kumar Goud: రిగ్గింగు సాధ్యం అయ్యే పనే కాదు.. ఓటమి భయంతో చేసే ఆరోపణే రిగ్గింగ్ అని జూబ్లీహిల్స్ ఎన్నికలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఓడిపోయే వాళ్ళు సహజంగా నిందలు వేస్తారని.. ఎగ్జిట్ పోల్స్ కంటే మా కార్యకర్తల సమాచారమే మాకు కీలకమన్నారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ముచ్చటించారు. మంచి మెజారిటీ తో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, కార్యకర్తలు బాగా పని చేశారని…
CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ…