బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్సీ కవిత రేపటి నుంచి దీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కవిత దీక్షకు సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 72 గంటలపాటు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 72 గంటలు నీళ్లు కూడా తాగకుండా గాంధేయ మార్గంలో దీక్ష చేయబోతున్నామన్నారు.
Also Read:Alia Bhatt : ఏకంగా 5 నేషనల్ అవార్డులతో.. సత్తా చాటిన అలియా భట్ ‘గంగూబాయి’
దీక్ష కోసం జాగృతి నుంచి ప్రభుత్వాన్ని, పోలీసు లను అనుమతి అడిగాము.. అందుకే కోర్టు కు వెళ్ళాము.. కోర్టు నుంచి అనుమతి వస్తుందని అనుకుంటున్నాం.. అన్ని పార్టీలకు లేఖలు ఇచ్చాము.. నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ ఖండించింది.. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం రియాక్ట్ కాలేదు.. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని పెద్ద నాయకుల హస్తం ఉంది.. అందుకే బీఆర్ఎస్ ఖండించలేదు.. నల్గొండ లో బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు..
Also Read:TTD : దేవదేవుని దివ్య ప్రసాదం ‘తిరుమల శ్రీవారి లడ్డూ’కు జన్మదిన శుభాకాంక్షలు
చావుతప్పి కన్ను లొట్టబోయి నట్లు ఒక్కడే గెలిచాడు.. లిల్లిపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు.. బీఆర్ఎస్ పార్టీ కి చెందని వ్యక్తి చేత నన్ను తిట్టిస్తున్నారు.. మన పార్టీ లో ఉండి ఇలా చేయడం దారుణం.. నా మీద కించ పరిచే విదంగా మాట్లాడిన నాయకుడు నాయి.. బ్రాహ్మణులను కించ పరిచే విదంగా మాట్లాడారు.. ఆ లిల్లిపుట్ నాయకుని గురించి చాలా తక్కువ మాట్లాడాలి అని కవిత తెలిపారు.