తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటలో వచ్చే ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. అయితే రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నాయని, రైతులు తొందరపడి ఆగమాగమై పంట కోయవద్దని సూచించారు. కోతలు అయిన వాళ్లు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకురావాలని సూచించారు. Read Also: సీఎం కేసీఆర్ డిమాండ్..…
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి…
ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా…
రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద…
హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారు అని బీజేపీ నేత రవీంద్ర నాయక్ అన్నారు. కేసీఆర్ ను ఓటమిని తట్టుకోలేడు నాకు తెలుసు. కేసీఆర్ గొప్పలు నిజమైతే హుజురాబాద్ లో ఓటుకు 20వేలు ఎందుకు ఇచ్చారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీకు, నీ కొడుకుకు,బిడ్డకు ఫామ్ హౌస్ లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలుసు. బండి సంజయ్ ని ఆరు ముక్కలు చేసే దమ్ముందా కేసీఆర్…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్‌లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. Read…
తన ఫాం హౌస్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదే పదే తన ఫాం హౌజ్‌ను దున్నుతా అంటున్నావ్.. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్‌వా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. చట్టం ప్రకారం కొన్న తన ఫాం హౌజ్ ముందు అడుగు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అయినా తనది ఫాం హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను వ్యవసాయం చేసే కుటుంబంలో…
హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. నీ డబ్బులు పని చెయ్యవని బుద్ధి చెప్పారు అంటూ బీజేపీ నేత విజయ శాంతి కామెంట్స్ చేసారు. డబ్బుతో కాదు , ఉద్యమం తో సీఎం వి అయ్యావు. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు. బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పారు అక్కడి ప్రజలు.. ఉద్యమం చెయ్యమని చెప్పారు. బీజేపీ టీమ్ వర్క్ గా పని చెయ్యాలి.. మాలో స్ప్లిట్ లేదని.. తెరాస, కాంగ్రెస్ లెక్క కాదని…
హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్…