తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్…
దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు…
బీజేపీపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని తెలిపారు. 12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ అవసరం దేశానికి లేదని.. 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి…
ప్రధాని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ఒప్పుకుందని.. తెలంగాణ ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ…
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో…
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే చెప్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్ ఈసారి కూడా తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రేవంత్ జోస్యం చెప్పారు. అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఈరోజు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో…
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరని ఆమె ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివి పడేసిన అపర…