సీఎం కేసీఆర్ డిమాండ్.. కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని… అలాగే బీసీ కులగణన చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. లెక్కలు దాచిపెట్టాలని భావించడం ఏంటని ప్రశ్నించారు. పారదర్శకత కావాలంటే కేంద్రం.. ఎవరి జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాలన్నారు. ఎందుకు వారి జనాభా దాచిపెట్టాలని.. ఇదేం బ్రహ్మపదార్థం కాదని కేసీఆర్ నిలదీశారు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
Read Also: అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్
రైతులకు మేలు కలిగేలా కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించాలని కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. కరోనా సంక్షోభం సమయంలోనూ రైతులను ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు గుర్తుచేశారు. మరోవైపు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాటాలు తేల్చేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టకూడదని, ఇందులో కేంద్రం విఫలమైందన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిశామని, మళ్లీ వెళ్లి కలుస్తామన్నారు. జలాల వాటాలపై త్వరగా తేల్చకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..