రైతుల పాలిట తాలిబన్ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇవాళ హుజురాబాద్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రతి ఓటర్ కు 20 వేల రూపాయలు ఇచ్చిందని… 15 వేల రూపాయలను ఆ పార్టీ కార్యకర్తలే మధ్యలోనే దొబ్బేసారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కాష్ ను నమ్ముకుందని… కాలిబర్, క్యారెక్టర్ ను నమ్ముకుంది బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్…
తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై మరియు పార్టీ భవిష్యత్ కార్యచరణపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. ప్రతి పక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని…ఈ సారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు…
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అంతా సీఎం కేసీఆర్ చలువ వల్లనేనన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. హైదరాబాద్ రామంతపూర్ లో జరిగిన ఎస్.ఎన్. ఎస్. డెవలపర్స్ నూతన వెంచర్ బ్రోచర్ ను నటుడు సుమన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట లో 50 ఎకరాలలో తమ ఆరవ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని, యాదాద్రి- కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తమ వెంచర్ ఉంటుందని కస్టమర్లకు అన్నిరకాల సదుపాయాలతో తమ వెంచర్…
తెలంగాణకు హరితహారంపై చర్చ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అసెంబ్లీ వేదికగా పలువురు వక్తలు ప్రశంసించారు. యువ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ అంబాసిడర్ గా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీయార్ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే తలంపుతో తెలంగాణకు హరితహారం ప్రారంభిస్తే, దాని నుంచి స్ఫూర్తి పొందిన సంతోష్ కుమార్…
ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో తెలంగాణలో పొలిటికల్ పార్టీల దృష్టి హుజురాబాద్‌పై పడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు రెండూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ తరఫున.. గులాబీ దళపతి ప్రచారం చేస్తారా? సీఎం కేసీఆర్ వ్యూహం ఏంటి? హుజురాబాద్ ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళ్తారా? టాప్ గేర్‌లో ఉన్న హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి EC ప్రకటన మరింత ఊపు నిచ్చింది. ఫీల్డ్‌లో ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చింది. ఇప్పుడా…
ఢిల్లీ పర్యటనలో రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…
తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నీరుగార్చారు అని బండి సంజయ్ అన్నారు. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కరసేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం వచ్చింది అన్నారు. కేసీఆర్ మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారు అన్న ఆయన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలి అన్నారు. వరిసాగు పై రైతులకు భరోసా కల్పించాలి. అలాగే మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్…
చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు.…
ప్రజా సంగ్రామ యాత్ర లో ప్రజలు తమ బాధలని చెప్పుకుంటున్నారు. నిర్మల్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అమిత్ షా రేపు నిర్మల్ బహిరంగ సభ లో పాల్గొంటారు. ప్రజా సంగ్రామ యాత్ర లో చాల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధలు చెప్తున్నారు. జీతాలు కూడా సరైన సమయం లో ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది ప్రభుత్వం. సెంటిమెంట్ పేరుతో ప్రజల్లో ఆవేశాలు…