ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర…
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్ పోలీస్ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది? సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు…
కరోనా భయం తొలగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్…
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. Read Also: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త కాగా తెలంగాణలో మంగళవారం…
తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్…
కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులే కేసీఆర్.. ప్రభుత్వానికి పాడే కడతారంటూ నిప్పులు చెరిగారు షర్మిల. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని చురకలు అంటించారు. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదని…కేసీఆర్ రైతు హంతకులని ఫైర్ అయ్యారు. రైతును కాటికి పంపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది… మీ అధికారానికి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో తన క్యాంప్ ఆఫీస్‌లో తిరు కె.చంద్రశేఖర్ రావు మంత్రి కేటీఆర్‌తో కలిసి తనను మర్యాదపూర్వకంగా కలిశారని, అద్భుత సమయాన్ని తనతో గడిపారని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేసీఆర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ భేటీలో ఇద్దరు సీఎంలు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. READ ALSO తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కుటుంబసభ్యులతో స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్ వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన…