తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. కాగా, మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి తేదీ…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరుతూ కేసీఆర్‌కు వి.హనుమంతరావు లేఖ రాశారు. ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఇంతకు ముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని వి.హనుమంతరావు గుర్తుచేశారు. కరోనా రోగులకు కిట్స్ పంపిణీ చేయాలని వీహెచ్ కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్‌ది బాధ్యత కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108…