తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ... ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా... తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయునా చెప్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. మూడు రోజులుగా…
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ…
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం…
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న…
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించకపోగా... సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్‌లో ఉన్నాయి.
కట్టండ్రా బ్యానర్లు.... కొట్టండ్రా డీజేలు.... చల్లండ్రా గులాల్ అన్న రేంజ్‌తో అంతా సెట్ చేసి పెట్టుకున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాణ. ఇంకేముంది... అయిపోయింది. మనకు మంత్రి పదవి వచ్చేస్తుంది. కాల్ రావడమే ఆలస్యం కారెక్కి హైదరాబాద్ వైపు దూసుకుపోవడమేనని కేడర్‌కు కూడా చెప్పేశారట. సరిగ్గా అక్కడ రాజ్‌భవన్‌లో... కవ్వంపల్లి సత్యనారాయణ అనే నేను అన్న మాట వినపడగానే... నియోజకవర్గంలో దుమ్మురేగిపోవాలంటూ.... అనుచరులకు ఆదేశాలిచ్చేశారట.
నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గం 15కు చేరింది. మంత్రి వర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. సామాజిక వర్గాల కూర్పుతో తెలంగాణ మంత్రి వర్గం రెడ్డి 4, ఎస్సీలు 4, బీసీలు 3, వెలమ 1, బ్రాహ్మణ 1,…
Konda Surekha : తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం ఉదయం కీలక సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అప్పటికే మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. వెంటనే అక్కడే హుటాహుటిన అక్కడకు చేరిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించింది. 2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం! మెడికల్ పరీక్షల…
ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనున్నది. సెక్రెటేరియట్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే చాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడిషినల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు అడిషినల్ పోస్టులు, ఫ్యాప్సికి…