ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనున్నది. సెక్రెటేరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే చాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడిషినల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు అడిషినల్ పోస్టులు, ఫ్యాప్సికి…
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాళ్ళ కోసమే ఆగుతోందా..? ఏం చేయాలో… ఎలా డీల్ చేయాలో అర్ధం అవకపోవడమే అసలు సమస్యా? ఒకే కుటుంబం నుంచి ఇద్దర్ని కేబినెట్‌లోకి తీసుకోవడం సాధ్యమేనా..? ఎన్నాళ్ళని వాళ్ళిద్దరి పేరుతో నానుస్తారు? ఫైనల్‌గా బ్రదర్స్ లొల్లిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది? ఎవరా సోదరులు? వాళ్ళ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. మరీ…
ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఊరించి…ఊరించి ఉసూరుమనిపించారా ..? అదిగో..ఇదిగో అంటూ చెప్పి ఆగమాగం చేసేశారా? జరగాల్సిన చర్చలు, రచ్చలన్నీ జరిగిపోయాక ఇప్పుడు తూచ్ అంటున్నారా? తెలంగాణ కేబినెట్ విస్తరణ కథ కంచికేనా? ఇక ఇప్పట్లో ఆ ఊసే ఉండబోదా? ఆ విషయంలో అసలేం జరిగింది? కేబినెట్ విస్తరణ ఉన్నట్టా..? లేనట్టా..? అదిగో…ఇదిగో అంటూ చేసిన చర్చలన్నీ ఉత్తుత్తివేవా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌వర్గాలకు వస్తున్న కొత్త ప్రశ్నలివి. వీటికి సమాధానాల కోసం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా… ఏమో.. ఎవరికి తెలుసు అన్నదే…
అదిగో పులి అంటే..... ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే... ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇంటా బయటా అవే మాటలు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’ని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు సహాయం, కొత్త రేషన్ కార్డులు, , నూతన టూరిజం పాలసీపై చర్చించనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమంపై కీలక…