తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల…
ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుండి తొలగించారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖ పంపింది సీఎం కార్యాలయం. దాంతో ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపింది గవర్నర్ కార్యాలయం. చివరి నిమిషం వరకు ఈటల రాజీనామా చేయలేదు. అయితే ఈటల పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఈరోజే కలెక్టర్ నివేదికను కూడా సమర్పించారు. ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు…