తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే, ఈ సమావేశం నిర్వహణ వేదిక విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాన్ని, ఈసారి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.…
తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్ ఎవరో తెలిసిందా? కేబినెట్ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్‌స్టాప్‌గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్ తెలంగాణ కేబినెట్‌లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష…
Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1.…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. Also Read: Niloufer Cafe Babu…
Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
Azharuddin : తెలంగాణ కేబినెట్‌లోకి మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ రానున్నారు. ఎల్లుండి ఆయన మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అజారుద్దీన్, తనకు ఇచ్చిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు. Kantara Chapter 1 :…
Off The Record: తెలంగాణ కేబినెట్‌లో హెవీ వెయిట్స్‌కు కొదవలేదు. ఎవరికి వారు నేనే సీఎం అని ఫీలయ్యే బ్యాచ్ కూడా బాగానే ఉందని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో… తాజాగా ఒకరిద్దరి వ్యవహారశైలి కాస్త అనుమానాస్పదంగా ఉందట. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై సమాచారం తెలుసుకునేందుకు వాళ్ళు వేరే రూట్‌లో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర శాఖల సంగతి సరే… చివరికి సొంత డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కూడా…. సమాచారం కావాలంటూ ఆర్టీఐకి దరఖాస్తులు చేస్తున్నారట.…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ సహా పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పునరుద్ధరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంది. 1. ప్రపంచంలోనే…
TG Cabinet : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు జరిగిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది.. మరో 15 లక్షల మెట్రిక్…