తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయునా చెప్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తాను. హైదరాబాద్‌కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రులకు శాఖలకు కేటాయిస్తాను. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయినా నాకు చెప్తే అప్పుడు ఆలోచిస్తాను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై నేను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేను. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి లేకుండా.. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై ఎలా నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Ponnam Prabhakar: నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి.. విత్తనాలు ఫ్రీగా ఇస్తా!
‘తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన కుల గణనపై మేము పాటించిన విధానాన్ని కర్నాటకకు తెలియజేయడానికి నేను ఢిల్లీకి వచ్చాను. నాతో సహా కర్నాటక సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసి వేణుగోపాల్, రాహుల్ గాంధీ సమావేశమయ్యాం. కుల గణనలో కుల జనాబా లెక్కింపు ఒక అంశం మాత్రమే. వాస్తవానికి కుల గణన అన్నది సామాజిక, ఆర్ధిక, విద్య, రాజకీయ సర్వే. స్థానిక సంస్థల్లో మేం చేసిన కుల గణన ప్రకారమే 42 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.