తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్‌టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, Telangana Elections 2023, Telangana Assembly Elections, National News, International News
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.
Nagarkurnool:కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి.
చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ రాకపోవడంతో చేవెళ్ల రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి విదితమే.