కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ బహిరంగసభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జయ భేరి సభకు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణా వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాక్రే హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ పెళ్లి, చింతపల్లిగూడ, ఆదిభట్ల, బొంగులూరు, మంగళపల్లి, కొంగర కలాన్ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిస్తేనే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు.
Congress Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టనుంది. ఓటింగ్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారే ప్రత్యర్థులుగా మారారు.
MLC Kavitha: సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాపం, గాంధీ కుటుంబానికి పదేళ్లలో ఒక్కసారి కూడా వందల మంది తల్లుల కడుపు కోత గుర్తుకు రావడం లేదు.
Telangana Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 28,057 మంది ఓటర్లను ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతించినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.