Manda Krishna Madiga: మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తా అని ప్రకటించిన దమ్మున్న లీడర్ మోడీ అంటూ మందకృష్ణ కొనియాడారు. మాదిగలకు అండగా ఉంటానని నాలుగు రోజుల్లోనే మళ్ళీ వచ్చారన్నారు. ఏ ప్రధాని రాలేదన్నారు. దళితున్ని ప్రెసిడెంట్ చేశారని, అడవి బిడ్డను రాష్ట్రపతి చేశారన్నారు. కాంగ్రెస్‌లో ఇవి సాధ్యం కాలేదని, వాళ్లు ఎందుకు చేయలేదన్నారు. కేసీఆర్ దీక్షను విరమింప చేసిన వారిలో నేను ఉన్నానని… కానీ ఆయన మంత్రి వర్గంలో ఒక్క మాదిగ మంత్రి లేరన్నారు. వెలమలు నలుగురు… రెడ్డీలు7 గురు మంత్రివర్గంలో ఉన్నారన్నారు. నో కాంగ్రెస్, నో బీఆర్‌ఎస్ అని.. మనకు రాజకీయాలు కాదు.. మన భవిష్యత్ ముఖ్యమని మంద కృష్ణ పేర్కొన్నారు.
Also Read: PM Modi: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు
కేసీఆర్ మాదిగలను అణచి వేశాడన్న మందకృష్ణ.. మోడీ మాదిగలను పైకి తీసుకెళ్లారన్నారు. “తమిళనాడులో మురుగన్ ఓడిన ఆయనకు రాజ్య సభ ఇచ్చి కేంద్ర మంత్రి చేశారు. కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్‌లపై ఊరించింది… మోడీ 48 గంటల్లో మహిళ రిజర్వేషన్ చట్టం చేశారు. సామాజిక న్యాయం గురుంచి కథలు చెప్పేది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అయితే.. న్యాయం చేసేది మోడీ. 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్‌ల గురించి ఉద్యమం చేశాం. కాంగ్రెస్ మాదిగ జాతిని మోసం చేసింది. మోడీ గారు మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ నినాదానికి న్యాయం చేయండి. మోడీ మీ మనస్సు వెన్న పూస…. మీ గుండె గట్టిది. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి వచ్చారు. దేశ ప్రధాని గారే మీ వేదిక మీదికి వస్తున్నారు అంటే మీ సమస్య పరిష్కారం అయినట్టే అని దేశ మేధావులు అన్నారు. మాట మీద నిలబడే నాయకుడు ప్రధాని మోడీ. దక్షిణాది మాదిగలు బీజేపీకి మద్దతుగా ఉంటారు.” అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.