రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో మరిన్ని కీలకాంశాలు ఉండబోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఆదాయం పెంపు.. పెరిగిన సంపద ద్వారా పేదలకు సంక్షేమం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు.
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు.
కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు సంచులతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంబర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దారుణంగా దాడి చేశారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. తర్వాత కోడికత్తి, కత్తిపోటు అంటూ హేళన చేశారని మంత్రి ఆవేదన వ్యకం చేశారు. గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.. గువ్వలపై కాంగ్రెస్ నేత వంశీకృష్ణ స్వయంగా రాళ్లు విసిరారని మంత్రి హరీశ్ వెల్లడించారు.
కాళేశ్వరం మీదు ఏ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు మీద బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోదాడతో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీరు వచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చిన మంచి పేరును చెడగొట్టాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. నాకు నేను ట్రబుల్ షూటర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదని.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్ మాట జవ దాటలేదన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి స్పష్టం చేశారు.