CPI Narayana: రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. రాష్ట్రంలో నిజంగా సీరియస్ గా పోటీలో ఉంటున్నారు అనేది రెండ్రోజుల్లో తేలబోతోదన్న ఆయన.. మాకు పొత్తులో భాగంగా కాంగ్రెస్, సీపీఎం, జన సమితి, వైఎస్‌ఆర్‌టీపీ మద్దతు ప్రకటించాయి అని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.. నియామకాల విషయంలో నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. దళిత బంధు పేరుతో అనేక ఇబ్బందులు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది నిజమే అయినప్పటికీ.. అనేక చోట్ల డ్యామేజ్ జరిగింది.. పిల్లర్లు డ్యామేజ్ అయ్యింది మొదటిసారి… గతంలో కట్టిన ప్రాజెక్ట్ ల్లో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లర్లు దెబ్బ తినడం ఏంటీ అసలు? ఇసుకపై కట్టడం ఏమిటీ? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వారి ఫామ్ హౌస్ లు కళకళలాడుతున్నాయి… 15 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే ఎలా 2 వందల ఎకరాలకు వెళ్లింది? కొండపోచమ్మ ప్రాజెక్ట్ డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లోకి ఎలా వెళ్తున్నాయి..? అని ప్రశ్నించారు నారాయణ.. కొత్తగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉండాల్సిందే.. చిన్న మాల్ పెట్టిన షేర్ ఉండాల్సిందే.. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన ప్రతి డెవలప్‌మెంట్ లో కల్వకుంట్ల కుటుంబానికి షేర్‌లు లేకుండా లేవు.. తీగల బ్రిడ్జిల్లో కూడా షేర్ లతోనే కట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. అవినీతిని అయినా జనాలు ఒకానొక దశలో ఒప్పుకుంటారెమో.. కానీ, కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగిపోయింది.. ఈ అహంతోనే ఈసారి అధికారం కోల్పోతున్నారు. ఈ అహనికి పునాదులు ఢిల్లీ లో ఉన్నాయి.. బీజేపీ అండ చూసుకుని బీఆర్ఎస్ ఇంతలా అహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ముగ్గురు కలిసి దేశంలో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు నారాయణ.. జైల్ లో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు.. బయట ఉండాల్సిన వారు జైల్ లో ఉంటున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే రోజు రాష్ట్ర , కేంద్ర సంస్థలు దాడులు చేశాయని గుర్తుచేశారు. కానీ, ఈ రోజు సబితా ఇంద్రారెడ్డిపై చేసేది నిజమైన ఐటీ దాడులు కాదన్నారు. ఇక, ప్రధాని బీసీ, ఎస్సీ సభలు అంటున్నారు.. గతంలో చాలా సార్లు మందకృష్ణ ప్రధానిని కలిసే ప్రయత్నం చేశారు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవని ప్రధాని.. ఇప్పుడు ఎందుకు కలిశారు..? అని నిలదీశారు. ఎందుకు అన్ని డ్రామాలు ఆడారు స్టేజ్ పై.. మంచి నటులు కూడా అంతబాగా నటించరేమో.. అంటూ ఎద్దేవా చేశారు. కానీ, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ సీట్లు పెరగవు.. బీజేపీ కన్నా నోటా ఓట్లు ఎక్కువ వస్తాయి.. బీజేపీ.. బీసీ, సామాన్యులకు, మైనారిటీ, ఎస్సీలకు వ్యతిరేకులు అని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో కూడా బీజేపీ పడిపోతుందని వారికి అర్థమైంది.. అందుకే అంత ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు నారాయణ.. ఎన్నికలు కాబట్టి ఇన్నిసార్లు తెలంగాణకి తిరుగుతున్నారు.. జనగణన ఎందుకు అమలు చేయడం లేదు, మహిళా బిల్లు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు.. సరిగ్గా ఎన్నికల సమయం రాగానే రాముడు గుర్తొస్తాడు.. దేవాలయాలు గుర్తుకు వస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కే అద్వానీ సమయంలో బీజేపీని బాగా ఊపుమీదకు తీసుకొచ్చారు… కానీ, అద్వానీని పక్కన పడేశారు ప్రధాని మోడీ.. సొంత పార్టీలో ఉండి అద్వానీకి కూడా ముఖ్యమైన పదవులు దక్కనియ్యలేదు.. పార్టీ లోపల, బయట అన్నింటా అణిచివేతకు తెగపడుతున్నరు.. అన్ని సంస్థల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోంది బీజేపీ అని దుయ్యబట్టారు.. ఇక, బీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శించారు.. ఆర్థిక వ్యవస్థ నీ కల్వకుంట్ల కుటుంబానికి అనుకూలంగా మలుచుకున్నాయి.. 17 మంది మంత్రివర్గం లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారు ఎంతమంది…? అని ప్రశ్నించారు. మిగితా అంతా తెలంగాణ ద్రోహులేగా? రాజకీయంగా దివాలోకొరుగా మార్చింది బీఆర్ఎస్.. నంబర్ వన్ దొంగలు ఎంఐఎం.. వారితో బీఆర్ఎస్‌కు స్నేహం ఏమిటి? అని నిలదీశారు.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఓటు వేయొద్దు.. ఒక్కదెబ్బకు అంటే ఒక్క ఓటు కి మూడు పిట్టలు పడిపోవాలి.. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి.. బీఆర్ఎస్‌ని గద్దె దింపండి అంటూ పిలుపునిచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.